అంబేద్కర్ ఆశయాలను కాపాడుకునేందుకు అందరూ ఏకం కావాలి
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని
మహబూబాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
పాలకుర్తి నియోజక వర్గం,తొర్రూర్ మండలం,హరిపిరాల గ్రామంలో జరిగే జై భీమ్,జై బాపు,జై సంవిధన్ భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జై బాపు,జై బీమ్,జై సంవిధన్ కార్యక్రమ పాలకుర్తి ఇంచార్జ్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు,స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రాజ్యాంగాన్ని కాపాడుకుందాం..దేశాన్ని పరీక్షించుకుందాం అనే నినాదాలు తో ముందుకు సాగారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉందని,ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని,అహింస శాంతి సిద్ధాంతాలను కాపాడుకునేందుకే ఏఐసీసీ ఉద్యమ కార్యచరణను రూపొందించిదాని,రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను కాపాడుకునేందుకు అందరూ ఏకం కావాలని,పార్లమెంట్ సాక్షిగా మోడీ సర్కార్ రాజ్యాంగాన్ని అనుగదొక్కాలని చూస్తుందని,అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వాక్యాలను దేశ ప్రజలు ఎవ్వరు మర్చిపోరని,తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చూపిస్తున్న వివక్ష రాజ్యాంగ విరుద్ధమని,బీజేపీ నిరంకుశ పాలనతో ప్రజలు విసిగిపోతున్నారని,రానున్న రోజులలో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని,రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని తెలిపారు.


Comments