తెలంగాణ పునర్నిర్మాణం ప్రారంభమైంది
ప్రజల ఆశయాలకు న్యాయం జరుగుతోంది
-కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గాదె శివ చౌదరి
కూకట్ పల్లి,తెలంగాణ ముచ్చట్లు:
నీళ్లు- నిధులు - నియామకాలు అంటూ ఉద్యమం ప్రారంభించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ ప్రజలు గత పాలనలో మోసపోయారని కాంగ్రెస్ యువనేత గాదె శివ చౌదరి ఆరోపించారు.ఉద్యమ విరసం కోల్పోయిన రాష్ట్రాన్ని పునః నిర్మించేందుకు ప్రజలు కాంగ్రెస్‌కు తిరిగి మద్దతిచ్చారని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా శివ సోదరి మాట్లాడుతూకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు అప్పులు తీర్చుకుంటూనే, మరోవైపు 'రైజింగ్ తెలంగాణ' పేరుతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు.ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు రాష్ట్రంపై ఆసక్తి చూపుతూ పెట్టుబడులు పెడుతున్నారని,దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఉన్న నమ్మకమే కారణమని వ్యాఖ్యానించారు.ప్రజా పాలనలో భాగంగా పేదలకు రేషన్ కార్డులు,సన్న బియ్యం ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు మంజూరవుతున్నాయని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలుగుతున్నాయని చెప్పారు. మహిళల సాధికారత కోసం మధ్యతరగతి పరిశ్రమలకు ప్రోత్సాహం,పెట్రోలు బంకుల ఏర్పాటుకు రుణాల మంజూరు జరుగుతోందని వివరించారు.
యువత కోసం 'రాజీవ్ యువ వికాసం' కింద రూ.4 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.'ఫ్యూచర్ సిటీ' నిర్మాణం ద్వారా తెలంగాణ ప్రపంచ స్థాయిలో పోటీ పడే స్థాయికి వెళ్ళుతోందన్నారు.
రా కదిలిరా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమవుదాం అంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
Comments