ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను వెంటనే చేపట్టాలి
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
-మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
ఉప్పల్,తెలంగాణ ముచ్చట్లు:
హైదరాబాద్ నుంచి యాదాద్రి, వరంగల్ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉప్పల్ సమీపంలో ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్ (ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్) నిర్మాణాన్ని ప్రారంభించింది.కానీ ఈ ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం సహాయనిరాకరణ కారణంగా తీవ్ర జాప్యం ఏర్పడిందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్
ప్రభాకర్ తెలిపారు,శనివారం
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను వేగవంతం చేయడం కొరకు కేంద్ర ప్రభుత్వం,రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి, కాంట్రాక్టర్ను దారిలో పెట్టాలి, జిహెచ్ఎంసి మెడలు వంచాలని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ ఆధ్వర్యంలో మహంకాళి దేవాలయం నుండి ర్యాలీ నిర్వహించారు,ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం నితిన్ గడ్కరీ స్వయంగా మంజూరు చేసిన ప్రాజెక్టు. ఇది.అంతేకాకుండా,గడ్కరీ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు కూడా ఇదే.ప్రధాని నరేంద్ర మోదీ ఉప్పల్ అభివృద్ధికి రూ.600 కోట్లు కేటాయించారు.కేంద్రం రూ.600 కోట్లు ఇవ్వగా, జీహెచ్ఎంసీకి అవసరమైన స్ట్రీట్ లైట్స్ వాటర్ లైన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆరేళ్లు ఆలస్యం చేసింది.రాష్ట్ర ప్రభుత్వ సహాయనిరాకరణకు ఉదాహరణ.ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం అనుమతులు ఇచ్చే సమయంలో భూసేకరణను 6 నెలల లోపు పూర్తి చేయాలని షరతుతో శంకుస్థాపన జరిగింది.కానీ అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పలు రంగాల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించారు,కరెంట్ స్తంభాలు తొలగించడంలో జాప్యంసీవరేజ్ లైన్లు తొలగించడంలో అలసత్వంవాటర్ పైపులైన్ల విషయంలో నిర్లక్ష్యంనష్టపరిహారం చెల్లింపులో జాప్యంగతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు,జీహెచ్ఎంసీ ఈ పనులకు సహకరించలేదు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొద్దునిద్ర వహిస్తూ ఉప్పల్ జంక్షన్ అభివృద్ధిలో జాప్యం చేస్తోంది. గతంలో మంత్రి కేటీఆర్ను నిలదీసిన తర్వాతే ఉప్పల్లో కొన్ని స్తంభాలు,ఇతర కట్టడాలు తొలగించబడ్డాయి.మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైదరాబాద్ వస్తున్నారు.ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఒత్తిడి తెచ్చి,ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చి,ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను వెంటనే పూర్తిచేయాల్సిన అవసరం ఉంది,ఉప్పల్లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీనిర్వహించారు.ఈకార్యక్రమంలో కార్పొరేటర్ బండారి శ్రీవాణి వెంకట్రావు, గొరిగే కృష్ణ,రావుల బాలకృష్ణ గౌడ్,శ్రీనివాస శర్మ,దేవసాని బాలచందర్,బొంగు రమేష్ గౌడ్,రెడ్డి గారి దేవేందర్ రెడ్డిరేవు నరసింహ,కొల్లు బాల్ రాజ్,ఏసూరు యాదగిరి, పోతగోని గోపాల్ గౌడ్,బిజెపి డివిజన్ అధ్యక్షులు రాం ప్రదీప్,సంతోష్ గుప్తా,శాంతి కిరణ్,సంధ్యారెడ్డి,బోరంపేట మురళి,వర్కల రాజేందర్ గౌడ్,ఉప్పు శంకర్,రాము యాదవ్,సంఘీ స్వామి, సంపత్,చంద్రయ్య,జ్యోతి,మేనక,సీనియర్ బిజెపి నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు,
Comments