చలివేంద్ర ప్రారంభించిన రవికుమార్ యాదవ్
Views: 1
On
కూకట్‌పల్లి, తెలంగాణ ముచ్చట్లు:
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్‌నగర్ డివిజన్ 123 పరిధిలో జాతీయ రహదారి వద్ద కళామందిర్ బస్ స్టాప్‌లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీరూ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
వీరి ఆహ్వానంతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీ నాయకులతో కలిసి పౌరులకు నీటిని అందించారు.
ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, “వేసవి తీవ్రత మధ్య రహదారిపై ప్రయాణించే బాటసారులకు ఈ చలివేంద్రం ఉపశమనం కలిగిస్తుంది. యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలి,” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బీసీ మోర్చా, ఏసీ మోర్చా, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు, స్థానిక యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
06 May 2025 22:53:35
జనగాం,తెలంగాణ ముచ్చట్లు:
జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన...
Comments