వికలాంగులకు అండగా ఎమ్మెల్యే నాగరాజు

వికలాంగుల కాలనీకి రూ.1.5 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

వికలాంగులకు అండగా ఎమ్మెల్యే నాగరాజు

వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:

వర్ధన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కొనసాగింపులో భాగంగా ఆదివారం 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి వికలాంగుల కాలనీలో రూ.1.5 కోట్ల సాధారణ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ పనులకు ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “ఒక్క రోజులోనే రూ.2.5 కోట్ల విలువైన డ్రైనేజీ, రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం అభివృద్ధిపట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని” పేర్కొన్నారు. ప్రారంభించిన ప్రతీ పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేస్తామంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు.

గత 15 నెలలుగా నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికీ మెరుగైన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల అంచనాలకు తగిన నాయకత్వాన్ని అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జన్ను శీభరాణి–అనీల్ కుమార్, కాంగ్రెస్ నాయకులు బుద్దె పెద్దన్న, రైతు రాజు, గాదె రాము, బిజిలి సంపత్, అఖిల్‌తో పాటు వికలాంగుల కాలనీ వాసులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20250525-WA0035

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .