భూభారతి దరఖాస్తుల విచారణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

భూభారతి దరఖాస్తుల విచారణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి

 హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

భూభారతి రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత రైతులకు నోటీసులు అందించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు.

 శుక్రవారం హనుమకొండ జిల్లా నడికూడ మండల తహసిల్దార్ కార్యాలయంలో పరకాల ఆర్డీవో డాక్టర్ నారాయణ, స్థానిక తహసిల్దార్  రవీందర్ రెడ్డి, సిబ్బందితో భూభారతి దరఖాస్తుల  విచారణ ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 

 ఈ సందర్భంగా పైలట్  మండలమైన నడికూడ మండలంలోని వివిధ గ్రామాలలో స్వీకరించిన భూభారతి దరఖాస్తుల విచారణ గురించిన వివరాలను  అధికారులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 


WhatsApp Image 2025-05-23 at 7.45.49 PM (1) అనంతరం అధికారులు సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ సదస్సులలో వచ్చిన అన్ని అప్లికేషన్లకు  నోటీసులు అందించి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించాలన్నారు. విచారణ అనంతరం తగు ఉత్తర్వులు జారీ చేసి  వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అప్లికేషన్ల విచారణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు అదనపు సిబ్బందిని కేటాయించాలన్నారు. సమీక్ష సమావేశం అనంతరం  ఇదే మండలంలోని రాయపర్తి గ్రామంలో భూభారతి దరఖాస్తుల పరిశీలనకు  ఏర్పాటు చేసిన విచారణ బృందం చేపడుతున్న విచారణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ గ్రామానికి చెందిన రైతు రాజేశ్వరరావు తో కలెక్టర్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
ఈ సందర్భంగా పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .