ప్రశాంతంగా యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్ష

ప్రశాంతంగా యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్ష

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు: 

హనుమకొండ జిల్లా లోని వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ పరీక్ష  ఆదివారం ప్రశాంతంగా  జరిగింది. 4141మంది అభ్యర్థులు పది పరీక్షా కేంద్రాలను కేటాయించగా ఉదయం 9:30 నుండి 11:30 గంటల వరకూ జరిగిన మొదటి సెషన్ పరీక్షకు 2435 మంది అభ్యర్థుల హాజరై పరీక్ష రాశారు. 1706మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2:30 నుండి 4:30 గంటల వరకు జరిగిన రెండో సెషన్ పరీక్షకు 2422 మంది పరీక్ష రాశారు. 1719మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. 

 యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తున్న పలు పరీక్షా కేంద్రాలను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సందర్శించారు. వడ్డేపల్లి లోని పింగళి ప్రభుత్వ మహిళా కళాశాల, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు. పరీక్షా కేంద్రాలలోని ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల నిర్వహణకు తీసుకున్న చర్యల గురించి ఆయా పరీక్షా కేంద్రాలకు సంబంధించిన  అధికారులను కలెక్టర్ అIMG-20250525-WA0051(1)డిగి తెలుసుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .