ప్రభుత్వ విద్య, వైద్యం పై జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం

--- ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు వీరపాగ రామకృష్ణ

ప్రభుత్వ విద్య, వైద్యం పై జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం

తెలంగాణ ముచ్చట్లు డెస్క్:

ప్రభుత్వ వైద్య, విద్య సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం జిల్లా కలెక్టర్ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు.

వనపర్తి జిల్లాలో ఇటీవల వివిధ మండల, గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలలను ధర్మ సమాజ్ పార్టీ నాయకులు సందర్శించారు. వాటి సమస్యలు ప్రాథమికంగా ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు బోధించే అధ్యాపకులు నాణ్యతతో కుడిన కంప్యూటర్ ల్యాబ్,సైన్స్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్ తో కూడిన విద్యను అందించాలి, మధ్యాహ్న భోజనంలో పిల్లల బరువు తగ్గట్టుగా పౌష్టికాహారం అందించాలని, సురక్షితమైన తాగునీటిని ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ &నాన్ టీచింగ్ స్టాఫ్ ను నియమించాలని, పాఠశాల ఆరోగ్య కేంద్రాలలో పరిశుభ్రమైన బాత్రూమ్స్ మరియు టాయిలెట్స్ వసతులను కల్పించాలి. శానిటేషన్ చేయడం మరుగుదొడ్లను శుభ్రపరచడం,అన్ని రకాల రోగులకు సంబంధించిన డాక్టర్లను అందుబాటులో ఉంచే ప్రజలకు 24/7 వైద్య సేవలు అందించే విధంగా చూడాలని, అన్ని రకల రోగాలకు సంబంధించిన మందులు నిత్యం అందుబాటులో ఉండే విధంగా రక్తా మరియు మూత్ర, x-ray, సిటీస్కాన్ ఎంఆర్ఐ కాని పరికరాలను కూడా అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వం కల్పించాలని, ఏ రకమైన టెస్ట్ రిపోర్ట్ అయిన 12 గంటలో రోగులకు అందించాలని, అన్ని శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసి పేద ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందే విధంగా చొరవ చూపాలని, సూచించాలని అధ్యయనం చేసిన వినతి పత్రాన్ని వనపర్తి జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ ఆదర్శ్ సురభి గారికి ఇవ్వడం జరిగింది, అలాగే ఆరోగ్య కేంద్రంలో ఉన్న వసతులను మరియు శానిటేషన్, ఫార్మసీ, పేషెంట్స్ బెడ్స్ ల్యాబ్స్ సందర్శించిన విద్య, వైద్యం వసతి రోగులకు కల్పించిన తీరును నాయకులు కలెక్టర్ గారికి వివరిస్తూ ప్రైవేట్ హాస్పటల్లో యాంటీబయాటిక్ అండ్ స్టెరాయిడ్స్, విచ్చలవిడిగా వినియోగని నియంత్రిస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్న డబ్బును అరికట్టాలని తెలియజేస్తూ మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అశోక్, మన్యం, బలరాం, ఈశ్వర్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్  జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్ 
జనగాం,తెలంగాణ ముచ్చట్లు: జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ‌ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన...
మే 31న మెగా హెల్పింగ్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం
వేచరేణి ఎల్ల దాసు నగర్ సంఘటనను ఖండించిన బీజేపీ
పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం… అక్కాచెల్లెళ్లు దుర్మరణం
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హన్మకొండలో నిరసన
పిల్లల్లో క్రమశిక్షణకు విబిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం