డబుల్ బెడ్‌రూమ్‌లో మహిళలు ఆరు గ్యారెంటీల అమలు చేయాలని  సీఐటీయూ

డబుల్ బెడ్‌రూమ్‌లో మహిళలు ఆరు గ్యారెంటీల అమలు చేయాలని  సీఐటీయూ

నాగారం, ఆగస్టు 22 (తెలంగాణ ముచ్చట్లు)

నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో మహిళలతో సమావేశం  సీఐటీయూ కీసర మండల నాయకులు బంగారు నర్సింగరావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహిళలకు వాగ్దానం చేసిన నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే సరఫరా చేయడం, అలాగే డబుల్ బెడ్‌రూమ్ గృహ లబ్ధిదారులందరికీ జీరో కరెంట్ బిల్లు పథకం అమలు చేయాలని కోరారు.

అదేవిధంగా, మహిళల కోసం స్వశక్తి, స్వయం ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వారికి సబ్సిడీ రుణాలు అందజేయాలని అన్నారు. డ్వాక్రా మహిళా పొదుపు సంఘాల పునరుద్ధరణకు సంబంధిత మున్సిపల్ అధికారులు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా మహిళా పొదుపు గ్రూపులను కూడా ఏర్పాటు చేయాలని నర్సింగరావు పిలుపునిచ్చారు.

ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈ నెల 25వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ధర్నాలో మహిళలంతా, ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ గృహ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ప్రాంతీయ మహిళలు విజయలక్ష్మి, యాదమ్మ, సాహిన, రుక్సానా, శకుంతల, సైదమ్మ, వర్ష తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .