అన్నపూర్ణ కాలనీ పార్క్ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు వేయాలని కార్పొరేటర్ కు వినతి
Views: 4
On
నాచారం, ఆగస్ట్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్‌లోని రాఘవేంద్ర నగర్‌లో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. అయితే పోచమ్మ గుడి నుండి అన్నపూర్ణ కాలనీ పార్క్ రోడ్డు వరకు ఇంకా సిమెంట్ రోడ్డు వేసే పనులు మిగిలి ఉన్నాయి.
ఈ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కాలనీవాసులు డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్‌ను వారి నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.
కార్పొరేటర్ మాట్లాడుతూ, మిగిలిన రోడ్డు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వై. యాదగిరి, మారయ్య, అశోక్, ఎం. యాదగిరి, పెంటయ్య, ప్రభాకర్, రాజ్‌కుమార్, లక్ష్మణ్, శ్రీనివాస్ చారి, ఎన్. యాదయ్య, ఐలాపురం, పరమేష్, పరశురాముడు, నవీన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments