రూ!18 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనుల ను పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్
చిల్కానగర్, ఆగస్టు 23 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్‌లోని ప్రశాంత్ నగర్ కాలనీలో సుమారు రూ !18 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ అధికారులు, కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, రోడ్డు పనుల నాణ్యతపై ఎటువంటి రాజీపడరాదని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. కాలనీవాసులకు పనుల సమయం లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ రాధిక, వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎద్దుల కొండల్ కోకొండ, కోకొండ జగన్, చేర్యాల శ్రీనివాస్, మాస శేఖర్, బాలకృష్ణ గౌడ్, శ్యామ్, బీరప్ప గడ్డ బాలు, బంటి గౌడ్, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్ మోహన్, జీఎస్ కృష్ణ స్వామి, ముత్యంరెడ్డి సుబ్బారెడ్డి, శాస్త్రి, లక్ష్మీ భూమేష్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Comments