కరుణాపురంలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
Views: 37
On
చిల్పూర్,ఆగస్టు22(తెలంగాణ ముచ్చట్లు):
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆరూరి రాజు నేతృత్వం వహించగా, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆరూరి రాజు మాట్లాడుతూ, “చిరంజీవి తెలుగు సినీ రంగానికి అపారమైన సేవలు అందించారు. ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా లక్షలాది మంది కంటి వెలుగులు పొందారు.
ఆయనలాంటి మహానటుడు, మానవతావాదిపుట్టిన రోజు ప్రతి అభిమానికి పండుగే. ఆయన ఆశీస్సులతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ సమాజానికి మేలుచేయాలి” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక అభిమానులు, స్నేహితులు, గ్రామ పెద్దలు పాల్గొని కేక్ కట్ చేసి ఆనందంగా వేడుకలను జరుపుకున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments