సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం 

నిర్మాతలు,కార్మికులు,ప్రభుత్వం కలిసే సమగ్ర విధానం అవసరం

-పరిశ్రమలో సంస్కరణలు తప్పనిసరని సీఎం స్పష్టం

హైదరాబాద్,ఆగస్టు24(తెలంగాణ ముచ్చట్లు):

తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో నిర్మాతలు, దర్శకులు ముఖ్యమంత్రిని కలిసి వివిధ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా కార్మికుల పట్ల నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. కార్మికులు, నిర్మాతలు, ప్రభుత్వం కలిసి ఒక సమగ్ర విధానం రూపొందిస్తే పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో సుహృద్భావ వాతావరణం నెలకొనడం అవసరమని, దీనికోసం అవసరమైతే సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతానని తెలిపారు.

సినిమా రంగంలోకి కొత్తగా వచ్చే వారికి నైపుణ్యాలు పెంపొందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇందుకోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని సూచించారు. అలాగే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా సినిమా రంగానికి సంబంధించిన శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసి, వివిధ విభాగాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు.

తెలుగు సినిమా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇలాంటి సందర్భంలో పరిశ్రమలో వివాదాలు, కలహాలు అవసరం లేదని, అందుకే సినీ కార్మికుల సమ్మె విరమణకు తాను చొరవ చూపినట్లు తెలిపారు. నిర్మాతలు–కార్మికుల మధ్య సంస్కరణలు తప్పనిసరి అని, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఒక నియమావళి రూపొందించుకోవాలని సూచించారు. సినీ రంగంపై ప్రభుత్వం ఎటువంటి పక్షపాతం చూపబోదని, ఎవరు వ్యవస్థలను తమ ఇష్టం వచ్చినట్లు నియంత్రించాలనుకుంటే అది సహించబోమని హెచ్చరించారు. అందరూ చట్ట పరిధిలోనే పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయని, తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను నిలబెట్టడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు.

ఈ సమావేశంలో సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, డి. సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డివివి దానయ్య, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల తదితరులు పాల్గొన్నారుIMG-20250824-WA0046IMG-20250824-WA0047

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .