యూరియా సరఫరా లో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది.

మాజీ మంత్రి దయాకర్ రావు అవగాహన రహితంగా మాట్లాడుతున్నారు.

యూరియా సరఫరా లో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది.

హసన్ పర్తి పిఎసిఎస్ చైర్మన్ బిల్లా ఉదయ రెడ్డి.

 హసన్ పర్తి,ఆగస్టు23(తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో విలేకరుల సమావేశం నిర్వహించి పిఎసిఎస్ చైర్మన్ జిల్లా ఉదయ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు యూరియా సరఫరా లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి  చేసినా ఆరోపణలు సరైనవి కావని అన్నారు. యూరియాను కేంద్ర ప్రభుత్వం ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయవలసి ఉండగా ఆగస్టు వరకు 5.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగిందని గత సంవత్సరం దాదాపు 91 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. ప్రస్తుత సంవత్సరం 118లక్షల ఎకరాల పైచిలుకు భూమి సాగులోకి రావడం జరిగిందని సాగు ఎకరాలు పెరగడంతో యూరియా కొరత ఏర్పడిందని అన్నారు.బిజెపి పాలిత ప్రాంతాలు కానటువంటి రాష్ట్రాల మీద కక్ష సాధింపు చర్యలు కేంద్ర ప్రభుత్వం చేసి యూరియా కొరత ఏర్పరిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసు పాలు చేస్తుందని ఆరోపించారు. మాజీ మంత్రి దయాకర్ రావు అవగాహన రహితంగా మాట్లాడుతున్నారని రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం లోని మంత్రులు రాష్ట్రానికి వచ్చిన యూరియా సరిపోడం లేదని చర్చలు జరిపారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అడగడంతో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా ఇవ్వడం జరిగిందని బి ఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని వచ్చిన ఎరువులను పారదర్శకంగా పంపిణీ చేయడం జరిగిందని రాబోయే రోజుల్లో సరిపడా ఎరువులు అందుతాయని వ్యవసాయ అధికారుల ద్వారా తెలుసుకున్నామని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఇలాంటి అవకతవలు జరిగిన చర్చలకు సిద్ధమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా 100% రావలసిన యూరియాలో 35% కేంద్ర ప్రభుత్వం కోత విధించడంపై చర్చించి రైతుల పక్షాన నిలబడలని ప్రజా ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి, పిఎసిఎస్ చైర్మన్ లు రాజేష్ గౌడ్,గోపాల్ రెడ్డి,మండల మహిళా అధ్యక్షురాలు జోరుకపూల,తోకల లక్ష్మారెడ్డి,రత్నాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,గొర్రె కిరణ్ కుమార్,మదన్ గౌడ్, సునీల్,వెంకట స్వామి గౌడ్,శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .