జమ్మిగడ్డలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
ఏ ఎస్ రావు నగర్,తెలంగాణ ముచ్చట్లు:
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ జమ్మిగడ్డలో శ్రీ గోపికృష్ణ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో, పూలతో అలంకరించగా, భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు, భజనలతో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంప్రదాయ పండుగలు సమాజంలో ఐకమత్యాన్ని, భక్తి భావనను పెంపొందిస్తాయని, యువత ఈ విలువలను కాపాడుకోవాలని సూచించారు. ఆలయ నిర్వాహకులు అతిథులను శాలువాతో సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ పావని రెడ్డి, మాజీ కౌన్సిలర్ రాముల యాదవ్, ఎం.బి. కృష్ణ యాదవ్ తో పాటు గోపికృష్ణ యాదవ్ సంఘం వ్యవస్థాపకులు, సలహాదారులు, పదాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదం వితరణ చేయగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో వేడుకలను విజయవంతం చేశారు.
Comments