బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.

25 మంది యువకుల రక్తదానం.

బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.

సత్తుపల్లి,ఆగస్టు 23( తెలంగాణ ముచ్చట్లు):

బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వివిధ కళాశాలలకు చెందిన 25 మంది యువకులు రక్తదానం చేశారు. శిబిరాన్ని శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి, మట్టా దయానంద్ కలిసి ప్రారంభించారు. రక్తదానం చేయటం మరొకరికి ప్రాణదానం చేసినట్లేనని వారు పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని సూచించారు. రక్తదాతలకు పండ్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

బ్రహ్మకుమారీస్ ముఖ్య కార్యనిర్వాహకులు దాదీ ప్రకాష్ మణి 18వ మెమోరియల్ డేను విశ్వ బంధుత్వ దినోత్సవంగా గుర్తిస్తూ సమాజ సేవా విభాగం తరపున ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమంలో మెడికల్ చీఫ్ డాక్టర్ ఆకాష్, ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, బ్రహ్మా కుమారి రాధిక, జెవిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోపి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు ధారా కృష్ణారావు, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారుIMG-20250823-WA0031

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .