.పి.ఆర్ లో ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం

భారతీయ అంతరిక్ష కేంద్రం నమూనా ఆవిష్కరణ.

.పి.ఆర్ లో ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం

.సత్తుపల్లి,ఆగస్టు 23(తెలంగాణ ముచ్చట్లు):IMG-20250823-WA0028

సత్తుపల్లి పట్టణంలో కే పి ఆర్ గౌతమ్ పాఠశాలలో శనివారం జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాల విధానం, అంతరిక్ష కేంద్ర నిర్మాణం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 9వ తరగతి విద్యార్థి భూక్య హనీష్ కుమార్ రూపొందించిన భారతీయ అంతరిక్ష కేంద్రం బి ఏ ఎస్ నమూనాను ఆవిష్కరించారు. చిన్నతనం నుంచే అంతరిక్షంపై ఆసక్తితో పరిశోధనలు ప్రారంభించిన హనీష్, వాడి పారేసిన వస్తువులతో తక్కువ ఖర్చుతో ఈ నమూనా తయారు చేశాడు. దీన్ని సిద్ధం చేయడానికి రెండు నెలలు పట్టిందని, భవిష్యత్తులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్నానని విద్యార్థి తెలిపాడు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ మా పాఠశాలలో ఇలాంటి ప్రతిభావంతుడు ఉండడం గర్వకారణం. హనీష్ భవిష్యత్తులో ఉపగ్రహ, అంతరిక్ష పరిశోధనల్లో రాణించాలని కోరుకుంటున్నామని అభినందించారు.

హనీష్ విజయానికి తల్లిదండ్రుల సహకారం ఎంతో ప్రధానమని ఆయన అన్నారు. ఆర్థికంగా సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ కుమారుడి ఆసక్తిని ప్రోత్సహించడానికి వెనుకాడలేదని తల్లిదండ్రులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .