డ్రైనేజీ సమస్యతో శివ సాయి నగర్ వాసుల ఆవేదన.!

డ్రైనేజీ సమస్యతో శివ సాయి నగర్ వాసుల ఆవేదన.!

సత్తుపల్లి, ఆగస్టు 28(తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి పట్టణంలోని కాకర్లపల్లి రోడ్డుకు ఆనుకుని ఉన్న శివ సాయి నగర్ కాలనీ వర్షాకాలం మొదలైనప్పుడల్లా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాలు పడగానే డ్రైనేజీ నీరు పొంగిపొర్లి రోడ్లపైకి వచ్చి ఇళ్లలోకి చేరుతోంది.

స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా పలుమార్లు అధికారులకు, గత ప్రభుత్వానికి సమస్యను తెలియజేసినా పెద్దగా స్పందన రాలేదు. ప్రస్తుత ప్రభుత్వం మరియు అధికారులు కాలనీని సందర్శించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదని వాసులు ఆరోపిస్తున్నారు.

దీని వల్ల ప్రతి ఏడాది వర్షాకాలంలో కాలనీలో జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాలనీ మొత్తం నీటమునిగిపోయి ప్రజలు ఇళ్లలో నుంచే ఇబ్బందులు పడుతున్నారు.

కాలనీ వాసులు తమ సమస్యను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ కూడా ప్రత్యక్షంగా పరిశీలించి అధికారుల ద్వారా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే కాలనీని వదిలి వెళ్లే పరిస్థితి వస్తుందని వాసులు ఆవేదన వ్యక్తం చేశారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .