ముదిరాజ్ భవన్‌కు మహార్దశ
పూర్తి స్థాయి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్, ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్‌లోని ముదిరాజ్ భవన్‌కు మంచి రోజులు రాబోతున్నాయి. ఆధునిక సౌకర్యాలతో భవనం పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోనుంది.
గతంలో మున్సిపల్ నిధులతో ఈ భవనాన్ని కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్ రెడ్డి నిర్మించినప్పటికీ, కొన్ని పనులు ఇప్పటివరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధుల ఆహ్వానం మేరకు కార్పొరేటర్ రజితాపరమేశ్వర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి భవనాన్ని పరిశీలించారు.
ముదిరాజ్ భవన్ పూర్తిస్థాయి నిర్మాణానికి మరియు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా రజితాపరమేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డిఈ వెన్నెల గౌడ్, ఏఈ రాజ్ కుమార్, మహంకాళి కృష్ణ, మామిళ్ల బాలరాజు, ఈగ బాలయ్య, ఈగ లక్ష్మణ్, రాపాక వెంకటేష్, ఈగ అంజయ్య, ఈగ శ్రీనివాస్, మహంకాళి రాజు, సల్లా ప్రభాకర్ రెడ్డి, తలారి జహంగీర్, కావలి రాము తదితరులు పాల్గొన్నారు.


Comments