గోకుల్ నగర్ భూకబ్జాదారులపై కఠిన చర్యలు తప్పవు: బీజేపీ నేత రవీందర్ సాగర్

గోకుల్ నగర్ భూకబ్జాదారులపై కఠిన చర్యలు తప్పవు: బీజేపీ నేత రవీందర్ సాగర్

మల్లాపూర్, ఆగస్టు 23 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్‌లో జరుగుతున్న భూకబ్జాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మేడ్చల్ జిల్లా కౌన్సిల్ మెంబర్ సంగిశెట్టి రవీందర్ సాగర్ డిమాండ్ చేశారు.

గోకుల్ నగర్‌లో అమాయక ప్రజలు కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లపై కొంతమంది కబ్జాదారులు కన్నేసి, నకిలీ జిపిఏ పత్రాలతో భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు, ప్రభుత్వం ఈ వ్యవహారంలో తక్షణం జోక్యం చేసుకోవాలని, లేకపోతే కోర్టును ఆశ్రయించి పోరాటం కొనసాగిస్తానని హెచ్చరించారు.

జయప్రద కాలనీలో కూడా ప్రభుత్వ పార్క్ స్థలం, షాపింగ్ కాంప్లెక్స్ స్థలాలను అక్రమంగా కబ్జా చేసి అమ్మిన ఘటనలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన రవీందర్ సాగర్, త్వరలో బండారం బయటపెడతానని అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .