మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా జనరల్ సెక్రటరీగా హన్మకొండ శ్రీకాంత్
హనుమకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన జర్నలిస్ట్‌కు కీలక బాధ్యత
-ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు బూర్గుల నాగేందర్ ఆదేశాల మేరకు నియామకం
-స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బొల్లెపాక రాజేష్ అధికారిక ప్రకటన
-నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన నూతన సెక్రటరీ శ్రీకాంత్
హనుమకొండ,ఆగస్టు24(తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా జనరల్ సెక్రటరీగా హనుమకొండలోని పెద్దమ్మగడ్డకు చెందిన హన్మకొండ శ్రీకాంత్‌ను నియమించినట్లు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లెపాక రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నియామకం ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు బూర్గులనాగేందర్ ఆదేశాల మేరకు జరిగినట్లు ఆయన వివరించారు.
శ్రీకాంత్ గత కొన్నేళ్లుగా జర్నలిజంలో చురుకుగా కొనసాగుతూ ప్రభుత్వం, ప్రతిపక్షాలపై విశ్లేషణాత్మక కథనాలు రాశారు. విద్య, ఆరోగ్య రంగాలపై లోతైన అధ్యయనం చేసి సమగ్ర నివేదికలు సమర్పించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఈ నిబద్ధత, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని హనుమకొండ జిల్లా జనరల్ సెక్రటరీగా శ్రీకాంత్‌ను నియమించినట్లు ఫోరం ప్రకటించింది.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ “జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య పరిష్కారమే నా తొలి ప్రాధాన్యం. వారి హక్కులు, భద్రత, సంక్షేమం కోసం అన్ని స్థాయిల్లో పోరాడతాను. అదేవిధంగా మాదిగ కమ్యూనిటీని వేధిస్తున్న సామాజిక, ఆర్థిక సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వం స్పందించేలా కృషి చేస్తాను. కమ్యూనిటీ అభివృద్ధి, జర్నలిస్టుల బలోపేతం కోసం నేను ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తాను” అని తెలిపారు.అదేవిధంగా తనకు ఈ బాధ్యత రావడానికి సహకరించిన రాష్ట్ర నాయకులు బొల్లెపాక రాజేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి పెండ్యాల సుమన్, జిల్లా అధ్యక్షుడు సందేల రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.


Comments