లచ్చన్నగూడెంలో విద్యుత్ శాఖ “పొలం బాట” కార్యక్రమం.

లచ్చన్నగూడెంలో విద్యుత్ శాఖ “పొలం బాట” కార్యక్రమం.

సత్తుపల్లి,ఆగస్టు 23(తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండల పరిధిలోని లచ్చన్నగూడెం గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శనివారం “పొలం బాట” కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది రైతులకు కేపాసిటర్ల ప్రాముఖ్యత, విద్యుత్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోటార్లు నడిపేటప్పుడు భద్రతా చర్యల గురించి అవగాహన కల్పించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులు 1912 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అంకారావు (ఏఈ), వెంకటేశ్వరరావు(లైన్ మెన్), గంధం వెంకటేశ్వరరావు (లైన్ మెన్), సాయి కుమార్ (అసిస్టెంట్ లైన్ మెన్), రాజేష్ (అసిస్టెంట్ లైన్ మెన్) పాల్గొని గ్రామస్థులతో మమేకమయ్యారు.

గ్రామ ప్రజలు విద్యుత్ శాఖ చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమాన్ని అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .