అధికారంలో ఉన్నా లేకున్నా సుధాకర్ రెడ్డి ఎప్పుడూ  సిద్ధాంతాన్ని వదల్లేదు

ఆయన వంటి నాయకులు దేశ రాజకీయాల్లో అరుదు

అధికారంలో ఉన్నా లేకున్నా సుధాకర్ రెడ్డి ఎప్పుడూ  సిద్ధాంతాన్ని వదల్లేదు

కాంగ్రెస్ సమావేశంలోనూ ఆయన సేవలను గుర్తుచేసి ఘనంగా నివాళులర్పించాం

-కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటు 

-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్,ఆగస్టు24(తెలంగాణ ముచ్చట్లు)‌: 

సీపీఐ జాతీయ నాయకుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం నిరుపేదలకు, బహుజన వర్గాలకు, సిద్ధాంతపరమైన రాజకీయాలను విశ్వసించే ప్రతి ఒక్కరికీ తీరని లోటు అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీపీఐ నాయకులు డి.రాజా, కె.నారాయణ, కూనంనేని సాంబశివరావు, అజీజ్ పాషా తదితరులతో మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి చేసిన సేవలను స్మరించుకున్నారు. విద్యార్థి ఉద్యమాల నుండి జాతీయ రాజకీయాల వరకు ఆయన నిరాడంబరంగా, రాజీపడని సిద్ధాంతాలతో కృషి చేశారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

ఏఐఎస్ఎఫ్ నాయకత్వం నుండి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యుడిగా ఎదిగినా ఆయన ఎప్పుడూ అహంకారానికి దూరంగా ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు జిల్లాకు చెందిన సురవరం, బూర్గుల రామకృష్ణ రావు, జైపాల్ రెడ్డి వంటి మహనీయుల కోవలో నిలిచారని, జిల్లా ప్రతిష్టను పెంచారని తెలిపారు. హైదరాబాదు విముక్తి ఉద్యమంలో, పత్రికా సంపాదకుడిగా ఆయన కుటుంబం చేసిన సేవలను గుర్తుచేస్తూ, తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప రెడ్డి పేరును పెట్టడం తమ ప్రభుత్వానికి గౌరవకారణమైందన్నారు.

“అధికారంలో ఉన్నా లేకున్నా సుధాకర్ రెడ్డి ఎప్పుడూ సిద్ధాంతాన్ని వదల్లేదు. ఆయన వంటి నాయకులు దేశ రాజకీయాల్లో అరుదు. కాంగ్రెస్ సమావేశంలోనూ ఆయన సేవలను గుర్తుచేసి ఘనంగా నివాళులర్పించాం. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సంతాప సందేశం పంపించారు. సుధాకర్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీకి, చాకలి ఐలమ్మ పేరును మహిళా విశ్వవిద్యాలయానికి, జైపాల్ రెడ్డి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి, గద్దర్ పేరును ప్రజా యుద్ధనౌకకు పెట్టిన విధంగానే, సుధాకర్ రెడ్డి జ్ఞాపకాన్ని శాశ్వతంగా నిలబెట్టేలా మంత్రివర్గంలో చర్చించి సముచిత నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.IMG-20250824-WA0042

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .