ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి జాతర

వనపర్తిలో రూ.23.22 కోట్ల పనుల శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి జాతర

వనపర్తి,ఆగస్టు22 (తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి శాసనసభ్యులు  తూడి మేఘారెడ్డి శుక్రవారం నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించి ఒకే రోజు రూ.23 కోట్ల 22 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాను పదవీ బాధ్యతలు చేపట్టిన 18 నెలల వ్యవధిలో మొత్తం రూ.1,759 కోట్ల అభివృద్ధి పనులు వనపర్తి నియోజకవర్గంలో ప్రారంభించామని తెలిపారు.
ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన పనుల్లో అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, హై లెవెల్ బ్రిడ్జిలు, హెల్త్ సెంటర్లు, పాఠశాల భవనాలు ప్రధానమని వివరించారు.
గత పదేళ్లలో బిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పేపర్లకే పరిమితమైందని, ప్రస్తుతం ఇందిరమ్మ రాజ్యంలో గ్రామ గ్రామాన అభివృద్ధి జాతర కొనసాగుతోందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రేషన్ కార్డుల మంజూరు, సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్తు, మహిళలకు వడ్డీ లేని రుణాలు వంటి పథకాల వలన గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొన్నదని తెలిపారు.అలాగే రానున్న రోజుల్లో వనపర్తి నియోజకవర్గాన్ని విద్య, క్రీడలు, వైద్యం, మహిళా స్వయం ఉపాధి తదితర రంగాల్లో మరింత అభివృద్ధి చేయాలని కృతనిశ్చయంతో పనిచేస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఖిల్లా గణపురం, వనపర్తి మండలం, వనపర్తి పట్టణం, గోపాల్పేట, రేవల్లి, గేదెల మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.కార్యక్రమాల్లో ఆయా మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము కాటు. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము కాటు.
సత్తుపల్లి, ఆగస్టు 28 (తెలంగాణ ముచ్చట్లు): మండలంలోని చిన్నపాకల గూడెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న దుర్ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచేసింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లీకూతుళ్లపై పాము...
డ్రైనేజీ సమస్యతో శివ సాయి నగర్ వాసుల ఆవేదన.!
సత్తుపల్లిలో గణపతి పూజల్లో ఎమ్మెల్యే మట్టా రాగమయి దంపతులు.
కాలి దప్పి మాట్లాడుతున్న కడియం 
మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఘనంగా ప్రారంభం
అధికారంలో ఉన్నా లేకున్నా సుధాకర్ రెడ్డి ఎప్పుడూ  సిద్ధాంతాన్ని వదల్లేదు
బయోటెక్నాలజీ,మెడికల్ టెక్నాలజీ రంగాల్లో ఆవిష్కరణలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం