వనపర్తి మండల గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక
పలుస శ్రీనివాస్ గౌడ్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు
వనపర్తి,ఆగస్టు 22 (తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం వనపర్తి మండల గౌడ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు పలుస శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా తిరుపతయ్య గౌడ్‌ను మండల అధ్యక్షుడిగా, కాటమొని శరత్ గౌడ్, ఖాసీం గౌడ్‌లను ఉపాధ్యక్షులుగా, అశోక్ గౌడ్‌ను ప్రధాన కార్యదర్శిగా, రవీందర్ గౌడ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కాట గౌని శ్రీనివాస్ గౌడ్‌ను కోశాధికారిగా ఎన్నుకున్నారు. అలాగే శ్రీనివాస్ గౌడ్, రాములు గౌడ్‌లను గౌరవాధ్యక్షులుగా, సూర్యం గౌడ్‌ను సలహాదారుగా నియమించారు. యూత్ విభాగంలో బాధ గౌని సురేష్ గౌడ్‌ను అధ్యక్షుడిగా, ఆర్. గంగాధర్ గౌడ్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన సభ్యులకు నియామక పత్రాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు పలుస శ్రీనివాస్ గౌడ్, జిల్లా గౌరవ సలహాదారులు నరసింహ గౌడ్, ఆంజనేయులు గౌడ్, ఉపాధ్యక్షులు సంగమేశ్వర గౌడ్, కృష్ణ గౌడ్, ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పులిజాల బాలరాజు గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్కల నరేందర్ గౌడ్, జాయింట్ సెక్రెటరీలు తిలకేశ్వర్ గౌడ్, కొండ శ్రీనివాస్ గౌడ్, మీడియా కన్వీనర్ సారే పురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.అలాగే వనపర్తి పట్టణ గౌడ సంఘ అధ్యక్షుడు బత్తుల వినోద్ గౌడ్, మండల సభ్యులు తిరుపతయ్య గౌడ్, అశోక్ గౌడ్, రాములు గౌడ్, శరత్ గౌడ్, రవీందర్ గౌడ్, పానగల్ మండల సభ్యులు రాజవర్ధన్ గౌడ్, శరత్ గౌడ్, అకీ రమేష్ గౌడ్, గంగాధర్ గౌడ్, కాటమను శ్రీనివాస్ గౌడ్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments