దళిత సంఘాల రాష్ట్ర కమిటీ జిల్లా అధ్యక్షులుగా సానాది సాయిబాబా నియామకం
కీసర, ఆగస్టు 22 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ దళిత సంఘాల ఐకాస రాష్ట్ర కమిటీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులుగా సానాది సాయిబాబ నియామకం జరిగింది. శుక్రవారం రోజున హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రం చేతుల మీదుగా నియామకపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా నూతన అధ్యక్షులు సానాది సాయిబాబ మాట్లాడుతూ, రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల హక్కుల సాధన కోసం దళిత సంఘాల ఐకాస చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో తన వంతు పాత్రను నిర్వర్తిస్తానని తెలిపారు. మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనకై నిరంతర పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
అలాగే, 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు నిరంతర ఉద్యమం కొనసాగుతుందని, అంతిమంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో వెనుక బడిన వర్గాలకు పొందుపరిచి న హక్కుల సాధనకై తన పోరాటం ఆగదని చెప్పారు.తనను నమ్మి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి నందుకు రాష్ట్ర అధ్యక్షులు బత్తుల చంద్రం కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సునీల్, రాష్ట్ర యువజన విద్యార్థి సంఘం ఇంచార్జి వనం రమేష్, దళిత సంఘాల రాష్ట్ర నాయకులు బయ్యారం రాజన్న, తుమ్మ శ్రీనివాస్, చిప్పల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Comments