ఘనపూర్ మండల ఆగారం గ్రామంలో పనుల జాతర ప్రారంభం
ఘనపూర్,ఆగస్టు22(తెలంగాణ ముచ్చట్లు):
ఘనపూర్ మండలంలోని ఆగారం గ్రామంలో పనుల జాతర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకుడు మున్నూరు జయకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రామంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులతో పాటు ఇకముందు చేపట్టబోయే పనులపై అధికారులతో చర్చించి, వాటిని త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం గ్రామంలోని నీటి కుంట నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.తరువాత గ్రామ సమస్యలపై నాయకులు, అధికారులతో సమావేశమై పరిష్కార మార్గాలు సూచించారు. కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుడిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్, గ్రామపంచాయతీ కార్యదర్శి రవికుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ మంజుల, కాంగ్రెస్ నాయకులు కృష్ణయ్య, నరేష్, వెంకట్రెడ్డి, జైపాల్, శేషయ్య, మహేష్, చంద్రకాంత్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments