వెల్టూర్ లో అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

వెల్టూర్ లో అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

పెద్దమందడి,ఆగస్టు23(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో నూతన అంగన్వాడి భవనాన్ని ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి, అంగన్వాడి ఆవరణలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పెద్దమందడి, అడ్డాకుల మండలాల లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ ..తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక పేద ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేర్చుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వని పరిస్థితి నెలకొంది” అని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఆర్. శ్రీనివాస్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు జి. ప్రేమ్ సాగర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కె. రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ టి. రఘు ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి. సాయి చరణ్ రెడ్డి, ఆర్. జగదీశ్వర్ రెడ్డి, డి.ఎస్. మహేష్, గుండెల ఆంజనేయులు, జిల్లా దిశ కమిటీ సభ్యుడు ఎం. రవి నాయక్, మాజీ జెడ్పిటిసి కె. వెంకటస్వామి, మాజీ ఎంపిటిసిలు సి. వెంకటయ్య, రామచంద్ర గౌడ్, శివశంకర్, వెంకటస్వామి, కె. బాలుచంద్రయ్య, సి. వెంకటేష్, తహసీల్దార్లు ఎన్. సరస్వతి, శేఖర్, గ్రామ కార్యదర్శి వెంకటస్వామి, కావలి రాజు, డి. వివేకానంద సాగర్, వడ్డే శేఖర్, డి. రవి సాగర్, డీలర్ శ్రీను, చందురెడ్డి, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.IMG-20250823-WA0040

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .