పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కడియం కావ్య

దేశ ప్రగతి మహిళా అభ్యున్నతిపై ఆధారపడి ఉంటుంది

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కడియం కావ్య

-కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

-సన్నబియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకం

ఆత్మకూరు,ఆగస్టు24(తెలంగాణ ముచ్చట్లు):

ఆత్మకూరు మండలం పెద్దపురం గ్రామంలో ఎంపీ లాడ్స్ నిధుల నుండి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మహిళా కమ్యూనిటీ హాల్ కు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య, శాసన సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన డా. కడియం కావ్య దేశ అభివృద్ధి మహిళా సాధికారతపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. మొదటి సంవత్సరంలోనే 21,600 కోట్ల రూపాయల వడ్డీరహిత రుణాలు మహిళా సంఘాలకు అందజేశామని తెలిపారు. పెద్దపురం గ్రామానికి మహిళా కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి రావడం ద్వారా మహిళల అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. మహిళలు డైరీ ఫార్ములు, చిన్న వ్యాపారాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందజేస్తోందని చెప్పారు.

రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాతే పేదలకు ఇండ్లు లభించాయని గుర్తుచేశారు. పేదవారు అన్నం కోసం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన భారీ అప్పులకు నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ కడుతూనే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను ఆపకుండా కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు రజిత, కవిత, జ్యోతి, ప్రత్యేకాధికారి నిర్మల, తహసీల్దార్ జగన్మోహన్ రెడ్డి, MPO విమల, సీసీలు రజిని, భాగ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ సునంద సుధాకర్ రెడ్డి, మండల పార్టీ, గ్రామ పార్టీ అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.IMG-20250824-WA0036IMG-20250824-WA0037

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .