బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ధర్మసాగర్ మండల కన్వీనర్‌గా పట్ల రమేష్
Views: 17
On
ధర్మసాగర్,ఆగస్టు23(తెలంగాణ ముచ్చట్లు):
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామానికి చెందిన యువనాయకుడు పట్ల రమేష్‌ను బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ధర్మసాగర్ మండల కన్వీనర్‌గా నియమించినట్లు మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ తాటికొండ రాజయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నియామకంతో పార్టీ బలోపేతం కాగలదని, సోషల్ మీడియా వేదికలో పార్టీ విధానాలను ప్రజలకు చేరవేయడంలో రమేష్ కీలక పాత్ర పోషిస్తాడని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పట్ల రమేష్ మాట్లాడుతూ, పార్టీ భవిష్యత్తు కోసంఅంకితభావంతోపనిచేస్తానని,నాయకత్వంఇచ్చినబాధ్యతనునెరవేర్చేందుకుకృషి చేస్తానని తెలిపారు.అనంతరం ఈ పదవి రావడానికి ప్రత్యక్షంగా,పరోక్షంగా సహకరించిన వారికీ రమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments