మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్

మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభించిన కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్

చిల్కానగర్, ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ డివిజన్‌లోని అపురూప హైట్స్‌లో ఓం శాంతి ఓం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. 
ఈ కార్యక్రమం రాజయోగిని దీదీ ప్రకాశమణి జీ 18వ ఆరోహణ దినోత్సవం సందర్భంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, “రక్తదానం అన్నిటికంటే శ్రేష్టమైన దానం. రక్తదానం ద్వారా ఒకరి ప్రాణం మాత్రమే కాకుండా ఒక కుటుంబాన్ని కాపాడగలుగుతాం,” అని తెలిపారు.

క్యాంప్‌లో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ కూడా పాల్గొని స్వయంగా రక్తదానం చేశారు. ఓం శాంతి ఓం వారు లక్ష యూనిట్ల రక్త సేకరణ లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పాన్ని ప్రశంసిస్తూ తాము కూడా ఆ ప్రయత్నంలో భాగస్వాములమవుతామని తెలిపారు.

రక్తదానం చేసిన వారికి కార్పొరేటర్ గీతా ప్రవీణ్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో అపురూప హైట్స్ అధ్యక్షుడు రామ్ రెడ్డి, వారి కార్యవర్గం, ఓం శాంతి ఓం టీమ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20250824-WA0014

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .