పానుగల్ గ్రామానికి చెందిన ఎనుముల కిష్టయ్య హత్య
కేసును చేదించిన పోలీసులు
వనపర్తి,ఆగస్టు23(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పానగల్ గ్రామానికి చెందిన ఎనుముల కిష్టయ్య హత్య కేసును పానుగల్ పోలీసులు సేవించారు.వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు శనివారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన వసంతపురం రాములు, తన భార్య విడిచి వెళ్లడానికి కిష్టయ్య కారణమని అనుమానం, అలాగే డబ్బులు దొంగలించి బైక్ కొనాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారం హత్య చేశాడు, అని చెప్పారు.ఆగస్టు 20న రాత్రి కిష్టయ్య ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో రాములు అతని తలపై పప్పుగుత్తితో కొట్టి, అనంతరం గొంతు పట్టి హత్య చేశాడు. అనంతరం జేబులో ఉన్న రూ.40,000 నగదు దోచుకొని, నేరానికి ఉపయోగించిన పప్పుగుత్తి కాడను కాలువలో పారవేశాడు. దొంగిలించిన డబ్బులో రూ.6,000 ఖర్చు చేసి, రూ.33,000 ఇంట్లో దాచిపెట్టినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. (23-08-2025) ఉదయం గ్రామంలో తిరుగుతున్న రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి మిగిలిన నగదు, రక్తపు మరకలున్న బట్టలు, పప్పుగుత్తి కాడను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు ఛేదనలో వనపర్తి సీఐ కృష్ణయ్య, పానుగల్ ఎస్సై శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషించారని డీఎస్పీ పేర్కొన్నారు. వీరిని ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డు అందజేస్తామని తెలిపారు.


Comments