డాక్టరేట్ పొందిన సతీష్ యాదవ్‌ను ఘనంగా సత్కరించిన సాహితీ కళావేదిక సభ్యులు

డాక్టరేట్ పొందిన సతీష్ యాదవ్‌ను ఘనంగా సత్కరించిన సాహితీ కళావేదిక సభ్యులు

వనపర్తి,ఆగస్టు24(తెలంగాణ ముచ్చట్లు):

అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ ప్రజాసేవలో గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా సాహితీ కళావేదిక సభ్యులు, ప్రజా సంఘాలు ఆయనను ఘనంగా సత్కరించాయి.
ఆదివారం  ఉదయం సాహితీ కళావేదిక సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు సతీష్ యాదవ్ నివాసానికి వెళ్లి శాలువాలు కప్పి, పూలమాలలు వేసి అభినందించారు. కళాకారులు కవితలు చెబుతూ, పాటలు పాడుతూ సతీష్ యాదవ్ సేవలను కొనియాడారు.
సమాజాభివృద్ధి లక్ష్యం
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా వనపర్తిని కాపాడుతూ, సమాజ అభివృద్ధికి కృషి చేద్దాం” అని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు
సాహితీ కళావేదిక అధ్యక్షుడు శంకర్ గౌడ్, కవి బై రోజు చంద్రశేఖర్, గౌరవ డాక్టరేట్ పొందిన ఉపాధ్యాయుడు కంటి నిరంజనయ్య, వనపర్తి గద్దర్ రాజారామ్ ప్రకాష్, కవి సత్తార్, బహుజన వేదిక అధ్యక్షుడు గంధం నాగరాజు, జైభీమ్ సేన అధ్యక్షుడు బండారు శ్రీనివాసులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు డి. రాములు, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .