సత్తుపల్లిలో డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం!

డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ.

సత్తుపల్లిలో డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమం!

 డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్.

సత్తుపల్లి, ఆగస్టు 23(తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి మండలంలో యువసేవ సమితి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  డ్రగ్స్ వల్ల అనేక కుటుంబాలు క్షీణిస్తున్నాయని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి నేతృత్వంలో గత 10 నెలలుగా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక చర్యలు తీసుకోవడం వలన సత్తుపల్లి నియోజకవర్గంలో డ్రగ్స్ వాడకం గణనీయంగా తగ్గిందని తెలిపారు. డ్రగ్స్ మూలాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నామని, సమాజం నుంచి వాటిని పూర్తిగా తరిమేయడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.యువత, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు.

కార్యక్రమంలో  సత్తుపల్లి–వేంసూరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనందబాబు, చల్లగుల నరసింహ రావు, గాదె చెన్నారావు, కమల్ పాషా, యువసేవ సమితి సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.IMG-20250823-WA0046

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .