మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఘనంగా ప్రారంభం
మేడ్చల్, ఆగస్టు 24 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు.ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా తరలి వచ్చి వేడుకలను విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మలిపెద్ది సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల ఇంచార్జ్‌లు వజ్రేష్ యాదవ్, బండి రమేష్, కోలన్ హనుమంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి బూపతి రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీని మరింత బలపరచడానికి ఈ కార్యాలయం కేంద్రంగా ఉపయోగపడుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. పలు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక నాయకులు
భారీగా హాజరై జెండా ఆవిష్కరణ, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు తమ ప్రసంగాల్లో, రాష్ట్రంలో పార్టీ పునరుద్ధరణకు ఈ కార్యాలయం కీలకమని పేర్కొన్నారు.


Comments