బయోటెక్నాలజీ,మెడికల్ టెక్నాలజీ రంగాల్లో ఆవిష్కరణలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

బయోటెక్నాలజీ,మెడికల్ టెక్నాలజీ రంగాల్లో ఆవిష్కరణలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం 

-హైదరాబాద్‌లో ‘ఆసియా పసిఫిక్ బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025’లో సిఎం రేవంత్ 

-“ఇన్నోవేషన్ ఆఫ్ భారత్ – ది బయోడిజైన్ బ్లూప్రింట్” ఆవిష్కరణ

హైదరాబాద్,ఆగస్టు24(తెలంగాణ ముచ్చట్లు):

హైదరాబాద్‌లో ఏఐజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ఆసియా పసిఫిక్ బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025 లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వేదికగా “ఇన్నోవేషన్ ఆఫ్ భారత్ – ది బయోడిజైన్ బ్లూప్రింట్” ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి బయోటెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు అవసరమైన మద్దతు ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తోందని స్పష్టం చేశారు. బయోడిజైన్ విధానం ఉపయోగించి వైద్య ఉత్పత్తుల ఆవిష్కరణలకు అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. మాన్యుఫాక్చరింగ్ స్థాయి నుంచి నూతన ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందడం శుభ సూచకమని పేర్కొన్నారు.

భారతదేశ ఆరోగ్య రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి స్వదేశీ ఆవిష్కరణలు కీలకమని ముఖ్యమంత్రి తెలిపారు. అలాంటి పరిశోధనలకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడమే కాకుండా వైద్య డేటాను డేటా గోప్యతా ప్రమాణాలకు లోబడి అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, కార్పొరేట్ భాగస్వాములతో అనుసంధానం చేసి ఆవిష్కరణలకు మరింత బలాన్ని ఇస్తామని చెప్పారు.

“ఇప్పటివరకు మన ప్రతిభ ఇతర దేశాల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడింది. ఇకపై మన మేదస్సు దేశ ప్రజల ప్రయోజనాల కోసం వినియోగించాల్సిన సమయం వచ్చింది” అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. క్లినికల్ అవసరాలకు అనుగుణంగా ఆచరణాత్మక పరిష్కారాలను బయోడిజైన్ విధానం అందిస్తుందని, ఈ దిశగా ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న పరిశోధనలు అభినందనీయం అని అన్నారు.

లైఫ్ సైన్సెస్ రంగంలో జాతీయ స్థాయిలో తెలంగాణ ఉన్నత స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యంగా డయాగ్నస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీ, ఇంప్లాంట్ టెక్నాలజీ, సర్జికల్ పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ రంగాల్లో తెలంగాణకు గణనీయమైన పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగాలని “తెలంగాణ రైజింగ్” లక్ష్యంతో ముందుకు సాగుతోందని వెల్లడించారు.

వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ ముందంజలో ఉందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. సుల్తాన్‌పూర్‌లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్‌ను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేశామని, ప్రస్తుతం అక్కడ 60కి పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ విజయానికి స్థానిక స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమల సహకారం ప్రధాన కారణమని పేర్కొన్నారు.ఈ సమ్మిట్‌లో ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర రెడ్డి, బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ చైర్మన్ డాక్టర్ రాజేశ్ కలపల, హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రావు, సెంటర్ ఫర్ బయోడిజైన్ (స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ) డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ మైరల్‌తో పాటు అనే

IMG-20250824-WA0050IMG-20250824-WA0049క దేశాలకు చెందిన వైద్య నిపుణులు, పరిశోధకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .