అమ్మపల్లిలో నూతన భవనాల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

అమ్మపల్లిలో నూతన భవనాల శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

పెద్దమందడి,ఆగస్టు23(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి శనివారం పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో రెండు నూతన భవనాలకు శంకుస్థాపనలు చేశారు. గ్రామపంచాయతీ భవనం, అంగన్వాడి భవనం నిర్మాణానికి పునాదిరాళ్లు వేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ – “గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. పంచాయతీ భవనం, అంగన్వాడి వంటి వసతులు ప్రతి గ్రామానికి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడతాం” అన్నారు.

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామ నాయకులు, పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .