బొల్లారం కేంద్రీయ విద్యాలయంలో ఘనంగా ముగిసిన 54వ జాతీయ క్రీడోత్సవాలు

బొల్లారం కేంద్రీయ విద్యాలయంలో ఘనంగా ముగిసిన 54వ జాతీయ క్రీడోత్సవాలు

సికింద్రాబాద్, ఆగస్టు 23 (తెలంగాణ ముచ్చట్లు):

సికింద్రాబాద్ బొల్లారం పి.ఎం. శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఐదు రోజులపాటు జరిగిన 54వ జాతీయ క్రీడోత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. ఈ క్రీడలలో 14, 17, 19 ఏళ్ల వయస్సులోపు బాలికల కోసం ఆర్చరీ, విలువిద్య వంటి పోటీలు ఉత్సాహభరితంగా నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వీణా అనిల్ కుమార్ రోటే మాట్లాడుతూ, ఈనెల 19 నుంచి 23 వరకు జరిగిన ఈ క్రీడలలో దేశవ్యాప్తంగా 20 రీజియన్లకు చెందిన 150 మంది విద్యార్థినులు పాల్గొన్నారని తెలిపారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థినుల కోసం పాఠశాల ఆవాస సదుపాయాలను కూడా కల్పించినట్లు పేర్కొన్నారు.

ముగింపు కార్యక్రమానికి అంతర్జాతీయ హెప్టాథ్లాన్ అథ్లెట్ అగసర నందిని ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఇందులో చెన్నై రీజియన్ ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ, "క్రీడల్లో గెలవడం మాత్రమే కాదు, పాల్గొనడం కూడా అంతే ముఖ్యమైందని, గెలుపు సాధించేందుకు కృషి చేయాలని" ప్రోత్సహించారు.

కార్యక్రమంలో పి.జి.టి. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు శ్రీరాయప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .