అల్వాల్ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆంజనేయ దేవాలయ భజన బృందం
విజయవంతంగా పూర్తయిన శ్రావణ మాస భజనోత్సవాలు
వనపర్తి, ఆగస్టు24(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల్ గ్రామంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో భజనోత్సవాలు వైభవంగా జరిగాయి.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గ్రామ భక్తులు సమూహంగా భజనలు చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని అలరించారు. ముఖ్యంగా ప్రతి శనివారం నిర్వహించిన రథోత్సవం విశేష ఆకర్షణగా నిలిచింది. ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజలు, హారతులు జరిపి, తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.
గ్రామ పెద్దలు, యువత, మహిళలు, చిన్నారులు ఎటువంటి కులమత, రాజకీయ వాదాలు లేకుండా ఐక్యంగా పాల్గొనడం విశేషం. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ ఉత్సవం గ్రామ సమైక్యతకు నిదర్శనంగా నిలిచింది.
కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన గ్రామ ప్రజలందరికీ శ్రీ ఆంజనేయ దేవాలయ భజన బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. గ్రామ చరిత్రలో నిలిచేలా ఈ శ్రావణోత్సవం ప్రత్యేక స్థానం సంపాదించిందని నిర్వాహకులు పేర్కొన్నారు.


Comments