వివిధ కొత్త పనులకు భూమి పూజ.

వివిధ కొత్త పనులకు భూమి పూజ.

హసన్ పర్తి,ఆగస్టు22( తెలంగాణ ముచ్చట్లు):

హసన్ పర్తి మండలంలోని గ్రామపంచాయతీలలో గ్రామాల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర 2025 లో భాగంగా గ్రామసభలు నిర్వహించి పూర్తి అయిన పనుల ప్రారంభోత్సవం,క్యాటిల్ షెడ్,గోట్ షెడ్, కమ్యూనిటీ మ్యాజిక్ సోప్ ఫిట్, ఫలవనాలు వివిధ కొత్త పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి సిద్ధాపూర్, అరవపల్లి, గ్రామ పంచాయతీలలో క్యాటిల్ షెడ్ లకు భూమి పూజ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పూర్తి చేసుకున్న కూలీలను, దివ్యాంగ కూలీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి,పి ఆర్ ఏఈ, ఆర్ డబ్ల్యుఎస్ ఏఈ, మిషన్ భగీరథ ఏఈ, అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .