యూరియా కొరతతో రైతుల ఇబ్బందులు.
ఉదయం మూడు గంటల నుండి క్యూ లైన్ లో పడిగాపులు.
ప్రభుత్వం యూరియా సరఫరా పెంచాలని రైతుల డిమాండ్.
హసన్ పర్తి, ఆగస్టు22( తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని యూరియా ఎరువుల కొరత రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.గ్రామాల్లో సకాలంలో వర్షాలు పడుతున్నప్పటికీ యూరియా ఎరువులు అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం ఎరువుల కోసం పొలం పనులు ఆపేసి ఎరువుల షాపుల వద్ద ఉదయం 3 గంటల నుండి క్యూ లైన్ లో నిలబడ్డప్పటికీ ఎరువులు అందకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారని రోజుల తరబడి డిపోలో చుట్టు తిరిగిన ఒక బస్తా దొరకడం లేదని పంట సాగు సీజన్ లో యూరియా లేకపోవడం వల్ల దిగుబడిపై ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో యూరియా సకాలంలో అందిందని కానీ ప్రస్తుత ప్రభుత్వంలో యూరియా కొరత అధికంగా ఉందని తక్షణమే ప్రభుత్వం స్పందించి పంట దిగుబడి పై ప్రభావం పడకుండా యూరియా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఎర్ర రాజు ఎల్లాపూర్ రైతు మాట్లాడుతూ
ఉదయం 3 గంటల నుండి క్యూ లైన్ లో నిలుచున్నప్పటికీ ఎరువులు దొరకడం లేదని అధికారులను అడిగితే స్టాక్ లేదని అంటున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఎరువులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.


Comments