సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

కీసర, ఆగస్టు 22 (తెలంగాణ ముచ్చట్లు)

రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు, కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాల నిరోధక చర్యలు మరియు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

శుక్రవారం మధ్యాహ్నం 12 నుండి 1 గంటల వరకు ఎం.జె.పి.టి.బి.సి. డబ్ల్యూ.ఆర్.ఇ.ఐ.ఎస్ బాలుర వసతి గృహం, బోగారం లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. అంజనేయులు, సెక్టార్ ఎస్‌ఐ డి. వెంకటేష్, అలాగే పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సుమారు 200 మంది విద్యార్థులు హాజరైన ఈ సమావేశంలో, ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పద్ధతులు, వాటి ప్రభావం, నివారణ చర్యలు, జాగ్రత్తలు గురించి విద్యార్థులకు వివరించారు. యువత సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, ఫ్రాడ్ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .