65 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన దయాకర్ రెడ్డి

65 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన దయాకర్ రెడ్డి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

ప్రయివేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందిన పేదలను ఆర్ధికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల చెక్కులతో పాటు వైరా నియోజకవర్గంలోని సింగరేణి , మధిర నియోజకవర్గంలోని చింతకాని, ముదిగొండ మండలాలకు సంబంధించిన మొత్తం 65 మంది చెక్కులను లబ్దిదారులకు క్యాంప్ కార్యాలయంలో అందించారు. ఈ సoదర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యానికి తమ ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని తెలిపారు. అర్హులందరికీ జాప్యం లేకుండా.. సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, జిల్లా నాయకులు చావా శివరామ కృష్ణ, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, రూరల్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకట్ రెడ్డి, మద్ది మల్లా రెడ్డి, మద్దులపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ కర్లపూడి భద్రకాళి, మద్ది కిషోర్ రెడ్డి, మందపల్లి నాగమణి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వెంపటి రవి, శేఖర్ రెడ్డి, నాగేశ్వరరావు, డీవీఆర్ బాబు, ఉమ్మినేని కృష్ణ, ఇమ్మడి తిరుపతి రావు, కోట వెంకటేశ్వర్లు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్  జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్ 
జనగాం,తెలంగాణ ముచ్చట్లు: జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ‌ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన...
మే 31న మెగా హెల్పింగ్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం
వేచరేణి ఎల్ల దాసు నగర్ సంఘటనను ఖండించిన బీజేపీ
పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం… అక్కాచెల్లెళ్లు దుర్మరణం
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హన్మకొండలో నిరసన
పిల్లల్లో క్రమశిక్షణకు విబిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం