పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచాలి
-స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ
Views: 6
On

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :
పారిశుద్ధ్య పనుల్లో వేగం పెంచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె తిరుమలాయపాలెం మండలం రాకాశితండా, కూసుమంచి మండలం పాలేరు, ఖమ్మం రూరల్ మండలం రాజీవ్ గృహకల్ప, పోలేపల్లి లలో పర్యటించి తనిఖీలు చేశారు. పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేయాలని, వ్యాధులు దరిచేరకుండా బ్లీచింగ్, దోమల నియంత్రణ కు ఆయిల్ బాల్స్ చర్యలు తీసుకోవాలని అన్నారు. వైద్య శిబిరాల్లో అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని, ప్రజలకు ఆరోగ్య పరిరక్షణకై అవగాహన కల్పించాలని అన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments