యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టండి 

విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి 

యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టండి 

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ తెలంగాణ ముచ్చట్లు :

వరదల నేపథ్యంలో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు 

వరదల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం లో స్పష్టం చేశారు. బుధవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ క్రమంలో అధికారులు, సిబ్బంది ఏ సమస్య వచ్చినా డిస్కౌంట్ సీఎండీల దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో సాహసోపేతంగా సిబ్బంది పనిచేసి గతంలో ఎన్నడూ లేని రీతిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు శరవేగంగా చేపట్టారని అభినందించారు. విద్యుత్ పునరుద్ధరణ సమయంలో క్షేత్రస్థాయిలోని సిబ్బంది భద్రత చర్యలు తీసుకొని పనిచేయాలని సూచించారు. భద్రతా చర్యల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించే రాదని అన్నారు. ప్రతి వినియోగదారుడి పైన ప్రత్యేక దృష్టి సాధించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సీఎండీలతో సచివాలయం నుంచి డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. వరదల మూలంగా విద్యుత్ సంస్థకు భారీ నష్టం ఏర్పడింది, నష్టం అంచనాలను స్పష్టంగా నమోదు చేసి వేగంగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో ఇంధన శాఖ సీఎం డి రోనాల్డ్ రోస్, జే ఎం డి శ్రీనివాస్, ఓ ఏస్ డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలి.  ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలి. 
జిల్లా కలెక్టర్‌కు గ్రీవెన్స్ లో టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్- 2843) వినతి. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నానబాల రామకృష్ణ,అర్వపల్లి నగేష్. ఖమ్మం బ్యూరో , ఆగస్టు 3(తెలంగాణ ముచ్చట్లు...
శ్రీనన్న ఆత్మీయ భరోసా..ప్రతి పేద కుటుంబ నమ్మకానికి ప్రతిక.
తెలంగాణ సాహితీ సంఘంలో గీతాకుమారికి స్థానం.
వేణుకుమార్ కుటుంబానికి నామ ట్రస్ట్ ద్వారా రూ.50 వేల ఆర్థిక సాయం.
బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.
కాకర్లపల్లి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి.
బాధితులకు కొండంత అండగా పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్.