శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయి..

 -జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయి..

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో ఆడిన వారే భవిష్యత్‌లో రాణిస్తారని జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. 

బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో  వసతిగృహాల విద్యార్ధిని, విద్యార్థులకు జిల్లా స్ధాయిలో నిర్వహించిన క్రీడల్లో విజేతలకు బహుమతుల ప్రదానంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, విజేతలకు, జ్ఞాపికలు బహుమతులను ప్రదానం చేసి విద్యార్థులను అభినందించారు.

 అనంతరం విద్యార్థిని, విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖీ ముచ్చటించారు.. 
మీ అందరికీ అన్నగా చెప్పుతున్న అంటూ కలెక్టర్ మాట్లాడారు.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలన్నారు.  

విద్యార్థులను పోటీ ప్రపంచంలో పోటీపడేలా ఉపాధ్యాయులు చదువుతోపాటు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. బాల బాలికలు ఆత్మవిశ్వాసంతో చదువు పైన శ్రద్ద పెట్టి లక్ష్యం లో విజయం సాధించాలన్నారు. నేటి తరం విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనన్నారు.

పాఠశాల స్థాయిలోనే బాలికలు ఖోఖో, వాలీబాల్‌, కబడ్డీ తదితర క్రీడల్లో రాణించడం అభినందనీయమన్నారు. క్రీడా ప్రతిభను బయటి ప్రపంచానికి పరిచయం చేసేందుకు క్రీడా పోటీలను నిర్వహించి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, నాకు కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులంటే మక్కువ ఎక్కువని తెలిపారు.  క్రీడల ప్రాముఖ్యత ఎలా ఉంటుందో తనకు తెలుసునని కలెక్టర్ అన్నారు. 

క్రీడలు ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని, మానసిక ఉల్లాసాన్ని  కలిగిస్తాయని అన్నారు. విజేతలకు పతకాలు అందజేసి, జ్ఞాపికలు అందజేసి అభినందించారు.WhatsApp Image 2024-12-04 at 9.11.35 PM

ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల అధికారి సునీల్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు నిజమైన అర్థం
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:  ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. కానీ ఈ పండుగకు నిజమైన అర్థం వచ్చేలా కార్మికుల జీవితాల్లో మార్పు రావాలి....
భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారమే మేడేకు సార్థకత
క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే
మే డే వాల్ పోస్టర్ విడుదల
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం
దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం... 
శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి......