గోల్డెన్ మటన్ & చికెన్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
చిలకనగర్, ఆగస్టు 22 (తెలంగాణ ముచ్చట్లు):
చిలకనగర్ డివిజన్ లో ప్రశాంత్ నగర్ రిలయన్స్ మార్ట్ పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన గోల్డెన్ మటన్ & చికెన్ సెంటర్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, యువత ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా స్వయం ఉపాధి కోసం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన మటన్, చికెన్ అందించడంతో పాటు వ్యాపారం అభివృద్ధి చెంది స్థానికులకు ఉపాధి అవకాశాలు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, బిఆర్ఎస్ నాయకులు ఎద్దుల కొండల్ రెడ్డి, కోకొండ జగన్, బాలకృష్ణ గౌడ్, బజార్ జగన్నాథ్ గౌడ్, రామాంజనేయులు, శ్యామ్, ఎండి అసద్, మార్క శీను, ఫారూఖ్, ఉబేద్, రాకేష్, తిరుపతి సాయికిరణ్ ప్రవీణ్, వాసు తదితరులు పాల్గొన్నారు.
Comments