సత్తుపల్లిలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
.సత్తుపల్లి, ఆగస్టు 22(తెలంగాణ ముచ్చట్లు):
పద్మ భూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు సత్తుపల్లి నియోజకవర్గంలో ఉత్సాహంగా జరిగాయి. సత్తుపల్లి శాసనసభ సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ పాల్గొని మెగాస్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవి సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణ బస్టాండ్ రింగ్ కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో మట్టా దంపతులు ప్రధాన అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి ఆనందం పంచుకున్నారు. అనంతరం పట్టణంలో పాదచారులకు అన్నపానీయాలు అందజేస్తూ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
చిరంజీవి స్థాపించిన రక్తసేకరణ శిబిరం, కంటి దానం ఉద్యమం వంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శమని మట్టా దంపతులు ప్రశంసించారు. చిరంజీవి సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు ప్రజలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఈ వేడుకల్లో పట్టణ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు దోమ ఆనంద్, మాజీ వైస్‌చైర్మన్ తోట సుజాల రాణి, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గాదె చెన్నారావు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శివా వేణు, పాత్రికేయ సంఘ అధ్యక్షుడు తోట కిరణ్, మాజీ కౌన్సిలర్లు, కాపు సంఘం నాయకులు, చిరంజీవి అభిమానులు, మహిళా నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు.
Comments