నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వప్నం సాకారం చేసిన తల్లి సోనియా గాంధీ
నెమలి అనిల్ కుమార్
Views: 17
On
మల్లాపూర్, డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు):
స్వరాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాటం చేసిన ధీరనారిగా, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేసిన తల్లి సోనియా గాంధీ అని గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ అన్నారు.
సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మల్లాపూర్ డివిజన్‌లోని ఎలిఫెంట్ సర్కిల్ వద్ద మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నెమలి అనిల్ కుమార్ ప్రత్యేకంగా పాల్గొని, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన త్యాగాలు, చూపిన సంకల్పాన్ని స్మరించుకున్నారు.కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సేవాదళ్ప్రతినిధులు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సెల్, మహిళా విభాగం, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు భాగస్వామ్యం అయ్యారు. 
Tags:
Related Posts
Post Your Comments
Latest News
11 Dec 2025 22:06:57
కాజీపేట్ డిసెంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు)
కాజిపేట్ జంక్షన్ పరిధిలో నిర్మాణం అవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో భూ నిర్వాసితులతోపాటు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే


Comments