ఎన్‌సీసీ క్యాంపులో డ్రోన్ శిక్షణ
200 మంది కేడెట్లకు ప్రత్యేక శిక్షణ
వరంగల్,తెలంగాణ ముచ్చట్లు:
కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో జులై 24 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహిస్తున్న ఇంటర్ గ్రూప్ ఎన్‌సీసీ శిక్షణా శిబిరం (క్యాంప్)లో భాగంగా, డ్రోన్ వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ శిక్షణను 4వ తెలంగాణ ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్‌సీసీ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఈ శిబిరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 7 గ్రూపుల నుంచి దాదాపు 200 మంది ఎన్‌సీసీ కేడెట్లు పాల్గొంటున్నారు. మొత్తం 9 విభాగాల్లో శిక్షణలు అందిస్తున్నారు. ముఖ్యంగా, రక్షణ రంగంలో డ్రోన్‌ల వినియోగం, వాటి సాంకేతికతపై శిక్షణను అందించడం కేడెట్ల మధ్య పోటీలు నిర్వహించి,తదుపరి జాతీయ స్థాయి శిబిరాల కోసం ఉత్తములను ఎంపిక చేస్తున్నారు.
డ్రిల్ విభాగంలోనూ శిక్షణతోపాటు పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారు ఆల్ ఇండియా వాయుసేన శిబిరం వంటి జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఈ శిబిరాన్ని వింగ్ కమాండర్ శ్రీ ఆశిష్ భాస్కర్ ధానాకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. శిక్షణ, పర్యవేక్షణ బాధ్యతలను కర్ణల్ అమిత్ పాండే, వింగ్ కమాండర్ శ్రీ వి.కే. ఆర్యా, లెఫ్టినెంట్ కమాండర్ శ్రీ గణేశ్, శిక్షకుడు సుమిత్ కిషన్లు నిర్వహిస్తున్నారు.క్యాంప్ అద్జుటెంట్‌గా జేడబ్ల్యూఓ ఆర్.కే. శర్మా, ఏరో మోడలింగ్ శిక్షకుడిగా శ్రీ శ్యామ్, ఆయుధ శిక్షణ బాధ్యతలు సర్జెంట్ ఫణీంద్ర నిర్వహిస్తుండగా, జిసిఐ షీతల్ రానా క్యాంపుకు సంబంధిత విధుల్లో నిమగ్నంగా ఉన్నారు.
Comments